: వైసీపీ భవిష్యత్ కార్యాచరణ... ఈ నెల 17 నుంచి 21 వరకు రిలే నిరాహార దీక్షలు
వైసీపీ అధినేత జగన్ దీక్షను భగ్నం చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 17వ తేదీ నుంచి 21 వరకు అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు. 18న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, 19న నియోజకవర్గ కేంద్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించబోతున్నట్టు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20వ తేదీ సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన, 21న బస్సు డిపోల ముందు ధర్నాలు చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకూ వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపు విజయవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు నిరసన మార్చ్ జరుగుతుందని చెప్పారు. ఈ నిరసన మార్చ్ లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొంటారని అంబటి వివరించారు.