: స్థానికత అంశంపై రాజ్ నాథ్ సింగ్ కు చంద్రబాబు లేఖ
కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాజధానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులు, ఇతర వర్గాల వారి పిల్లల స్థానికతపై లేఖలో ప్రస్తావించారు. స్థానికతలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివిధ వర్గాల పిల్లలకు స్థానికత ప్రతిబంధకంగా మారిందని స్పష్టం చేశారు. తమ పిల్లలు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారనే ఆందోళన ఉద్యోగులు, ఇతర వర్గాల్లో ఉందని బాబు లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి నిబంధనల్లో మార్పు చేయాలని కోరారు.