: కార్బైడ్ తో వచ్చే సమస్యలపై ప్రజలను చైతన్యపరచాలని హైకోర్టు ఆదేశం
కాల్షియం కార్బైడ్ తో పండ్లను మగ్గపెట్టి విక్రయిస్తున్న వ్యవహారంపై ఉమ్మడి హైకోర్టు ఈ రోజు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కార్బైడ్ తో మగ్గిన పండ్ల వల్ల వచ్చే సమస్యలపై ప్రజలను చైతన్య పరచాలని ఆదేశించింది. ఈ మేరకు పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపింది. గతంలో ఈ అంశంపై పలుమార్లు ఆగ్రహించిన కోర్టు, కార్బైడ్ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోరింది. కాయలను కృత్రిమంగా పండ్లు చేయడం తీవ్రవాదం కన్నా పెద్ద నేరమని హైకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.