: మన 'తేజాస్' రంగంలోకి దిగితే, పాక్ 'థండర్'లు ఎందుకూ పనికిరానట్టే!


ఇండియాలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న 'తేజాస్' విమానాలు యుద్ధానికి సిద్ధమైతే, పాకిస్థాన్ వద్ద ఉన్న జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు ఎందుకూ పనికిరానట్టేనని భారత రక్షణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే, తేజాస్ విమానాలు ఏఈఎస్ఏ (యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే) రాడార్, గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం, బీవీఆర్ (బియాండ్ విజువల్ రేంజ్) మిసైల్స్ ప్రయోగం, అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరిజ్ఞానం జోడించుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ విమానాలకు 57 విభాగాల్లో లోపాలున్నాయని గుర్తించగా, 43 లోపాలను తొలగించే పనులు జరుగుతున్నాయని, దూర ప్రాంతాలు ప్రయాణించడంతో పాటు ల్యాండింగ్ అయిన గంట వ్యవధిలో మరోసారి టేకాఫ్ కు సిద్ధమయ్యేలా వీటిని రూపొందించాల్సి వుందని వివరించారు. ఈ పనులన్నీ పూర్తయి, తేజాస్ విమానాలు పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి మరో మూడేళ్లు పట్టవచ్చని అన్నారు. కాగా, 1983లో తేజాస్ విమానాల తయారీని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మొదలు పెట్టగా, పలు అవాంతరాలు ఎదురైన సంగతి తెలిసిందే. 2026 నాటికి కనీసం 120 విమానాలను భారత వాయుసేన అమ్ముల పొదిలోకి చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

  • Loading...

More Telugu News