: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై వర్మ ట్వీట్లకు బండ్ల గణేష్ సమాధానం
గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ట్విట్టర్ వేదికగా యుద్ధం జరుగుతోంది. వర్మ ట్వీట్ చేయడం... దానికి పవన్ ఫ్యాన్స్ ఉక్రోషంతో సమాధానం ఇవ్వడం... మళ్లీ వర్మ రెచ్చగొట్టడం... మళ్లీ ఫ్యాన్స్ బీపీ పెంచుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కు అండగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిలబడ్డాడు. పవన్ కల్యాణ్ మీద చేసే విమర్శలను పవన్ ఊరేగింపులో పడే పూలలా భావిస్తామని చెప్పాడు. అయినా సూర్యుడి మీద ఉమ్మేస్తే... అంటూ... పవన్ కల్యాణ్ వ్యక్తిత్వానికి మీరెంత పెద్ద ఫ్యానో తనకు తెలుసని, అందువల్ల ఫ్యాన్స్ ను మీరే ముందుకు నడపాలని కోరాడు. వర్మగారూ మీరో పెద్ద సాయం చేయాలి... రాత్రి ట్వీట్ చేసి మా నిద్రని, పగలు ట్వీట్ చేసి మా పనిని పాడు చేయొద్దు అని సూచించాడు. బండ్ల గణేష్ ట్వీట్స్ పవన్ అభిమానులను అలరిస్తున్నాయి.