: గూగుల్ డూడుల్ గా పాక్ గాయకుడు అలీఖాన్
నేడు పాకిస్థాన్ ప్రముఖ గాయకుడు నస్రత్ ఫతే అలీఖాన్ జయంతి సందర్భంగా గూగుల్ నివాళులర్పించింది. ఆయనపై ప్రత్యేకంగా రూపొందించిన డూడుల్ ను గూగుల్ హోమ్ పేజీలో ఉంచింది. డూడుల్ లో తన బృందంతో కలసి నస్రత్ కచేరీ చేస్తున్నట్లుగా ఉంటుంది. ఆయన తన్మయత్వంతో పాడుతూ పైకి ఎత్తిన ఎడమ చేతిని గూగుల్ లోని 'ఎల్' అక్షరానికి బదులుగా డూడుల్ లో చూపించింది. 1948, అక్టోబర్ 13న ఫతే అలీఖాన్ జన్మించారు. ఖవ్వాలీ గాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. 10 గంటల పాటు నిర్విరామంగా ప్రదర్శన ఇవ్వడంలో సుప్రసిద్ధుడు. తన 49 ఏళ్ల వయసులో 1997, ఆగస్టు 16న ఆయన ఛాతినొప్పితో కన్నుమూశారు.