: చైనాలో స్వలింగ సంపర్కులను భయపెడతారట... ఎలాగంటే!


చైనాలో రోజురోజుకూ పెరుగుతున్న స్వలింగ సంపర్కులకు అడ్డుకట్ట వేసేందుకు ఆ దేశ ప్రభుత్వం ఎలక్ట్రిక్ షాకుల ట్రీట్ మెంట్ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. 'చానల్ 4' ఓ సీక్రెట్ ఆపరేషన్ చేసి, ఆపై ప్రసారం చేసిన డాక్యుమెంటరీలో ఈ విషయం వెల్లడైంది. చైనాలోని ఆసుపత్రుల్లోని వైద్యులు స్వలింగ సంపర్కులకు డ్రగ్స్ తో పాటు, అత్యంత బాధాకరమైన ఎలక్ట్రిక్ షాక్ థెరపీలను 'హోమోసెక్సువాలిటీ'కి వైద్యంగా సూచిస్తున్నారు. దీంతో స్వలింగ సంపర్కంపై ఉండే ప్రేమ, చికిత్స తరువాత భయంగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక ఆసుపత్రి ఈ ట్రీట్ మెంట్ ఇస్తే, అనంతరం బాధితుడికి 3,500 యువాన్ లను పరిహారంగా ఇస్తుందట. ఆపై వెబ్ సైట్లో క్షమాపణలు కూడా చెప్పాలట. ఆసుప్రతులు ఇచ్చే పరిహారాన్ని వివిధ రూపాల్లో కట్టాల్సిన పన్నుల నుంచి మినహాయించుకోవచ్చు. 1997లో చైనాలో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయగా, ఇప్పుడు వారి మనసులను మార్చాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది.

  • Loading...

More Telugu News