: నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు... ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన విజయవాడ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరారు. ప్రస్తుతం నారావారిపల్లెలో వేద పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు మట్టి, నీరు సేకరిస్తున్నారు. అమరావతి నిర్మాణం విజయవంతం కావాలని ఆయన పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తిరుమల నుంచి డాలర్ శేషాద్రితో పాటు, పలువురు అర్చకులు విచ్చేశారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఊరు నుంచి తెప్పించిన మట్టిని, నీటిని ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.