: కోదండరాంను కలసిన టీటీడీపీ అధ్యక్షుడు రమణ
తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాంను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కలిశారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ఆయనను ఈ సందర్భంగా రమణ, ఇతర టీడీపీ నేతలు సన్మానించారు. రైతు సమస్యలపై తమ పార్టీ చేస్తున్న ఉద్యమాలను వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర పోషించారని, ఇకపై ప్రజా జీవితంలో కూడా చురుకైన పాత్ర పోషించాలని కోరారు. అంతేగాక రైతులకు అండగా విపక్షాలతో కలసి పోరాడాలని, తమకు మద్దతు ఇవ్వాలని కూడా రమణ కోరారు. రైతుల సమస్యల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమయంలో వారిద్దరూ చర్చించినట్టు సమాచారం.