: విశాఖ ఏజెన్సీ వణుకుతోంది


విశాఖ ఏజెన్సీ వణుకుతోంది. శీతాకాలం ప్రారంభమైనా పట్టణ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగలేదు. అదే సమయంలో విశాఖ ఏజెన్సీ పరిధిలో ఉష్ణగ్రతలు పడిపోతున్నాయి. ఆంధ్ర కాశ్మీర్ గా పేరొందిన విశాఖ ఏజెన్సీలో సీజన్ ప్రారంభంలోనే పది డిగ్రీల సెంటీగ్రేడ్ కు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. ఈ లెక్కన డిసెంబర్ లో మరింత తీవ్రమైన చలి ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. పాడేరులో 10 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, మినమలూరులో 13 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఏజెన్సీ ప్రజలు వణుకుతున్నారు.

  • Loading...

More Telugu News