: వాళ్లు కూడా ఊహించి ఉండరు: కలిస్
భారత జట్టును వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడించి సౌతాఫ్రికా సిరీస్ ను ప్రారంభిస్తుందని టీమిండియా మాత్రమే కాదు, సఫారీల వీరాభిమానులు కూడా ఊహించి ఉండరని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వెస్ కలిస్ తెలిపాడు. సౌతాఫ్రికా అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిందని కలిస్ అభిప్రాయపడ్డాడు. చివరి ఓవర్లలో ధోనీలాంటి ఆటగాడిని రబడా కట్టడి చేసిన విధానం అంతర్జాతీయ అటగాళ్లను ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నాడు. ఈ అనుభవం రబడాకి జీవిత కాలం గుర్తుంటుందని కలిస్ తెలిపాడు. డివిలియర్స్ దూకుడుగా ఆడతాడని అందరికీ తెలుసని, కెప్టెన్ గా నిలకడైన నిర్ణయాలు తీసుకున్నాడని, చివర్లో రబడాపై విశ్వాసం కనబరిచి ఆకట్టుకున్నాడని చెప్పాడు. తొలి వన్డే ఓటమికి ధోనీని నిందించడం సరైన విధానం కాదని కలిస్ తెలిపాడు. ధోనీ నిబద్ధత గల ఆటగాడని స్పష్టం చేశాడు. భారత్ రెండో వన్డేలో పుంజుకోలేకపోతే సిరీస్ ఒదులుకోవాల్సిందేనని హెచ్చరించాడు.