: చంద్రబాబును జగనన్న భయపెట్టాడు: షర్మిల
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును భయపెట్టాడని అతని సోదరి షర్మిల తెలిపారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి ఆమె మాట్లాడుతూ, జగనన్న నీరసించిపోయాడని అన్నారు. కీటోన్స్ అదుపులోకి రావాలని వైద్యులు తెలిపారని ఆమె చెప్పారు. షుగర్ లెవెల్స్ పడిపోయాయని, వాటిని అదుపులోకి తెచ్చేందుకు వైద్యులు కృషి చేస్తున్నారని అన్నారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరమని చెప్పారని, నేడు మొత్తం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామన్నారని, రేపు సెమీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామని తెలిపారని, తరువాత ఘనాహారం ఇస్తారని ఆమె చెప్పారు. జగనన్న ఇలాగే దీక్ష చేస్తే రాజధాని నిర్మాణ ఏర్పాట్లను ప్రజలు అడ్డుకునే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందిందని, అందుకే ఆయన దీక్షను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేసిందని ఆమె వెల్లడించారు. జగన్ దీక్ష ఇలాగే జరిగితే, శంకుస్థాపన రోజున రాష్ట్ర ప్రజలు మోదీని అడ్డుకునే ప్రమాదం ఉందని బాబు భయపడ్డారని ఆమె పేర్కొన్నారు.