: జగన్ దీక్ష భగ్నం...ఆసుపత్రికి జగన్ తరలింపు


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోరుతూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న జగన్ శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన శరీరంలో కీటోన్స్ సంఖ్య పెరగడం ప్రారంభించింది. దీంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, వైద్యులు, పార్టీ కార్యకర్తలు జగన్ ను దీక్ష విరమించాలని కోరగా, ఆయన నిరాకరించారు. దీంతో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు జగన్ దీక్షను భగ్నం చేశారు. అంబులెన్స్ ను అడ్డుకునే ప్రయత్నం చేసిన పార్టీ కార్యకర్తలను చెదరగొట్టి, వైద్యం నిమిత్తం ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News