: బీహార్ లో బీజేపీ ఓడిపోతే ప్రధాని రాజీనామా చేస్తారా?: లాలూ ప్రసాద్
బీహార్ లో బీజేపీ ఓడిపోతే ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేయగలరా? అని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సవాల్ విసిరారు. బీహార్ లో రెండో విడత ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేతలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. జెహానాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని కూడా మహాకూటమి నేతలను ఘాటుగానే విమర్శించారు. బీహార్ ను పాలించిన నితీష్, లాలూలిద్దరూ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారన్నారు. తాను నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' కార్యక్రమం మహాకూటమి నేతలకు భయం పుట్టిస్తోందని మోదీ అన్నారు.