: తిరుపతి లడ్డూలో నాణ్యతాలోపం వాస్తవమే: టీటీడీ చైర్మన్ చదలవాడ
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రకరకాల సేవ చేసే, శ్రీవారి సేవకుల వసతి నిమిత్తం రూ.100 కోట్లతో భారీ భవనాన్ని నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. లడ్డూ నాణ్యత లోపించిందన్న వార్తల నేపథ్యంలో ఈరోజు ఆయన తనిఖీలు నిర్వహించారు. లడ్డూలో నాణ్యత లోపించినట్లు ఆయన గుర్తించారు. అందుకు కారణం సిబ్బంది చేతివాటమేనన్నారు. కాగా, శ్రీవారి సేవకులు నడిపే కౌంటర్లకు సంబంధించి ఫిర్యాదులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. లడ్డూ పంపిణీ బాధ్యతను శ్రీవారి సేవకులకు అప్పగించే యోచనలో టీటీడీ ఉన్నట్లు ఆయన చెప్పారు.