: జగన్ దీక్షా స్థలి వద్ద నిప్పంటించుకోబోయిన యువకుడు!
జగన్ నిరవధిక నిరాహారదీక్షా శిబిరం వద్ద ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నం చేశాడు. అయితే, అక్కడే ఉన్న కార్యకర్తలు యువకుడిని అడ్డుకున్నారు. ప్రాణాలు తీసుకోబోయిన ఈ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జగన్ దీక్షా శిబిరం వద్ద కొంత ఉద్రిక్తపరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం జగన్ నిరవధిక దీక్ష ఆరో రోజు కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే.