: హాస్టళ్లలో సౌకర్యాలను పరిశీలించేందుకు మేము సిద్ధం: రేవంత్ రెడ్డి
తెలంగాణలోని హాస్టళ్లను ప్రతిపక్షాలు పరిశీలించాలని మంత్రి ఈటెల రాజేందర్ అన్న మాటలను టీడీపీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి స్వాగతించారు. హాస్టళ్లలో సౌకర్యాలను పరిశీలించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. వసతి గృహాలలో విద్యార్థుల పరిస్థితిని తాము వివరిస్తే... మంత్రి వసతి గృహాలలో తనిఖీలు నిర్వహిస్తారని అనుకున్నామని విలేకరుల సమావేశంలో చెప్పారు. కానీ టీడీపీ నేతలు ఎప్పుడైనా వసతి గృహాలకు వెళ్లారా? అని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే ఈటెల పనిచేస్తున్నారని విమర్శించారు. కోడంగల్ నియోజకవర్గంలోని వసతి గృహాలలో పరిస్థితులను పరిశీలించామని తెలిపారు. అయితే ఉన్నతాధికారులను తాము విమర్శించలేదని చెప్పారు. మంత్రి ఈటెల అంటే తమకు గౌరవం ఉందని పేర్కొన్నారు.