: నిరాహార దీక్షకు దిగిన వ్యక్తికి ఆరోగ్యంపై భయమెందుకు?: ఎమ్మెల్సీ గాలి
ప్రత్యేక హోదాకై దీక్ష చేస్తున్న జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శలు చేశారు. ఆయన దీక్ష చేస్తున్నది కుర్చీకోసం తప్ప, ప్రజల కోసం కాదని ఆరోపించారు. ఏపీకి హోదా కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన జగన్ కు బీపీ, షుగర్ తో పనేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎందుకు భయపడుతున్నారని సూటిగా అడిగారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో గాలి మీడియాతో మాట్లాడారు. జగన్ కు హాని జరగాలని తామెవరమూ కోరుకోవడం లేదన్న ఆయన, జగన్ ఉంటే తమకే రాజకీయంగా మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. హోదా కోసం తమ అధినేత చంద్రబాబు కూడా కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారన్నారు.