: అమరావతి ఉత్సవాలు రేపట్నుంచే... సర్వం సన్నద్ధం


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉత్సవాలు రేపట్నుంచి (13వ తేదీ) ప్రారంభమవుతున్నాయి. ఈ వేడుకలను భారీ ఎత్తున, అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 13, 14, 15 తేదీల్లో మన మట్టి, మన నీరు, పుట్ట మట్టి, వాగు వంకల నుంచి జలాల సేకరణ, సర్వమత ప్రార్థనల మధ్య కలశాలను ఊరేగించడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. 15వ తేదీ రాత్రికి మండల కేంద్రాలకు కలశాలను చేరుస్తారు. 16, 17 తేదీల్లో ఆ కలశాలకు మండల కేంద్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 18వ తేదీన నియోజకవర్గ కేంద్రాల్లో కలశాలను ఊరేగిస్తారు. 19వ తేదీకి ఈ కలశాలన్నీ అమరావతికి చేరుకుంటాయి. 20, 21 తేదీల్లో అమరావతిలో కలశాలకు పూజ నిర్వహిస్తారు. 22వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అమరావతికి శంకుస్థాపన జరగుతుంది.

  • Loading...

More Telugu News