: షార్ అంతరిక్ష కేంద్రాన్ని పేల్చివేస్తామంటూ లేఖ... భారీ భద్రత
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని 'సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం'కు బెదిరింపు లేఖ వచ్చింది. షార్ కేంద్రాన్ని పేల్చి వేస్తామని లేఖలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ లేఖను ఉగ్రవాదులు రాసి ఉంటారని భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో షార్ అంతరిక్ష కేంద్రంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రతను భారీగా పెంచారు.