: బీజేపీని వీడుతానన్న వార్తల్లో నిజంలేదు: నాగం


బీజేపీని వీడి తాను టీడీపీలో చేరుతానన్న వార్తల్లో నిజం లేదని నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ వార్తలన్నీ ఊహాగానమేనని అన్నారు. పార్టీలో స్వేచ్ఛగానే కొనసాగుతున్నానని తెలిపారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లిన నాగం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హోంమంత్రి ఆహ్వానం మేరకు తాను ఢిల్లీకి వచ్చానని తెలిపారు. తాను ప్రారంభించిన 'బచావో తెలంగాణ మిషన్' ద్వారా ప్రజల్లోకి వెళుతున్న విషయాన్ని రాజ్ నాథ్ కు వివరించానన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రైతు ఆత్మహత్యలపై ఆయనతో చర్చించినట్టు చెప్పారు. రైతు సమస్యలు తెలుసుకునేందుకు తాను రైతు యాత్ర చేశానని వివరించారు.

  • Loading...

More Telugu News