: విశాఖలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన
విశాఖలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్ధాపన చేశారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కు అడిగిన వెంటనే భూమిని కేటాయించామని చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశాఖ కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లే కారణమని చెప్పారు. హుద్ హుద్ తుపాను సమయంలో విశాఖ ప్రజలు అందించిన సహకారం జీవితంలో మరచిపోలేనని గుర్తు చేసుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో సుందరీకరణ పనులను అంతకుముందు చంద్రబాబు ప్రారంభించారు.