: అది సిరా కాదు... భారత సైనికుల రక్తం: శివసేన
పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణ ఈ రోజు ముంబైలో జరిగింది. అంతకు ముందు, అబ్జర్వర్ అండ్ రీసర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, కులకర్ణి ముఖంపై సిరా పోశారు. అనంతరం, జరిగిన ఘటనపై శివసేన స్పందించింది. తమ కార్యకర్తలు చేసిన పని సరైందే అని శివసేన నేతలు స్పష్టం చేశారు. కులకర్ణి ముఖంపై పోసింది సిరా కాదని... భారత సైనికుల రక్తం అని ఆవేశంగా చెప్పారు. సిరా పూయడం చాలా సున్నితమైన అంశం అని తెలిపారు.