: రైతు ఆత్మహత్యలపై కవిత తప్పుడు లెక్కలు చెబుతున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై ఎంపీ కవిత తప్పుడు లెక్కలు చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ అన్నారు. రైతు కుటుంబాలను ఆదుకుంటామంటూ జాగృతి పేరుతో కలెక్షన్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సినిమాల విడుదలను అడ్డుకుని అక్రమంగా వసూళ్లు చేసే కవిత ఇప్పటికీ అదే పరంపరను కొనసాగిస్తున్నారని విలేకరుల సమావేశంలో విమర్శించారు. అటు రుణమాఫీఫై టీఆర్ఎస్ పార్టీ డొంక తిరుగుడు వైఖరి అవలంబిస్తోందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని తమ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భరోసా యాత్రలు చేస్తుంటే వాటిని విమర్శించడం సరికాదని సూచించారు.