: రైతు సంక్షేమంపై ప్రభుత్వాలు అనుకూలంగా వ్యవహరించాలి: కోదండరాం


రైతు సంక్షేమంపై ప్రభుత్వాలు అనుకూల దృక్పథంతో వ్యవహరించాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందించి రైతులకు సాయం అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా కరవు మండలాలను గుర్తించి ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిని పరిశీలించేందుకు తరాజ్ అభియాన్ తో రైతు సంవేదన యాత్రలో పాల్గొన్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News