: రచయిత సుధీంద్ర కులకర్ణిపై దాడిని ఖండించిన అద్వానీ
బీజేపీ నేత, రచయిత సుధీంద్ర కులకర్ణి ముఖంపై ఇంకుతో శివసేన కార్యకర్తలు చేసిన దాడిని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలకు అవకాశం ఉండాలని అద్వానీ అభిప్రాయపడ్డారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలని తెలిపారు. ఇలాంటి ఘటనలతో దేశానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజ్జు కూడా కులకర్ణిపై దాడిని ఖండించారు.