: జగన్ ను ఇలా చూస్తుంటే బాధగా ఉంది: భారతి


వైకాపా అధినేత జగన్ చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన సతీమణి వైయస్ భారతి ఆందోళన వెలిబుచ్చారు. తన భర్త షుగర్ లెవెల్ కూడా 61కి వచ్చేసిందని... అది కనీసం 80 పైన ఉంటేనే మంచిదని ఆమె తెలిపారు. ఆరు రోజుల నుంచి జగన్ ఏమీ తినలేదని... ఆయనను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని... అది సరైన పద్ధతి కాదని సూచించారు. వాళ్లు ఏం చేయబోతున్నారో ప్రజలకు చెప్పకుండా... పక్క వారిని తప్పుబట్టడం మంత్రులకు తగదని అన్నారు.

  • Loading...

More Telugu News