: ఎస్వీ యూనివర్సిటీలో న్యాయ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మాసమయ్య అనే ఓ న్యాయ విద్యార్థి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోతుండగా అక్కడే ఉన్న మిగతా విద్యార్థులు, పోలీసులు అతనిని అడ్డుకున్నారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్ తదితర సంఘాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. వర్సిటీలోని పరిపాలనా భవనం ముందు బైఠాయించి హోదాకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న మాసమయ్య ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.