: తిరుమల లడ్డూ నాణ్యత తగ్గింది: టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ నాణ్యత తగ్గిందని టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూలపై ఫిర్యాదులు పెరుగుతుండడంతో తిరుమలలో ఆయన మాట్లాడుతూ, సిబ్బంది జీతాలు తక్కువగా ఉండడంతో లడ్డూల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. గతంలో లడ్డూలు నాణ్యతతో ఎక్కువ రోజులపాటు నిల్వ ఉండేవని ఆయన చెప్పారు. తాజా లడ్డూలు వారం రోజులు కూడా నిల్వ ఉండడం లేదని ఆయన ఆరోపించారు. కౌంటర్ లో ఉండే సిబ్బంది భక్తులను మోసగిస్తున్నారని ఆయన విమర్శించారు. సిబ్బంది నిర్వాకంతో శ్రీవారి ప్రసాదం ప్రాముఖ్యత తగ్గుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.