: జగన్ తో సమానంగా లోకేశ్ తో దీక్ష చేయించాలి: వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్


ప్రత్యేక హోదాకై వైఎస్ జగన్ చేస్తున్నది దొంగ దీక్షంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ కాకినాడ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ ఖండించారు. గతంలో చంద్రబాబు చేసినవే దొంగ దీక్షలని ఎద్దేవా చేశారు. అందుకే అందరినీ దొంగ బుద్ధితో చూస్తున్నారన్నారు. గతంలో ఆయన నిరాహార దీక్ష చేస్తే షుగర్, బీపీ ఎందుకు డౌన్ కాలేదని ద్వారంపూడి ప్రశ్నించారు. దమ్ముంటే జగన్ తో సమానంగా ఆయన కుమారుడు లోకేశ్ తో దీక్ష చేయించాలని సవాల్ విసిరారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇవాళ జగన్ దీక్షకు మద్దతుగా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఐదో రోజు రిలే దీక్ష జరిగింది.

  • Loading...

More Telugu News