: అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి కారుచౌకగా కొన్నారా?


ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వైకాపా తీవ్ర ఆరోపణలు చేసింది. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రత్తిపాటి కారుచౌకగా కొన్నారని వైకాపా నేతలు మోపిదేవి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. ఈ ఆస్తులను ప్రత్తిపాటి ఆయన భార్య పేరు మీద కొనుగోలు చేశారని చెప్పారు. ఆస్తులు కొన్న దస్తావేజులు తమ దగ్గర ఉన్నాయని... ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వాటిని బయటపెడతామని హెచ్చరించారు. ఈ కొనుగోలు వ్యవహారంపై సీఐడీ విచారణ జరిపించాలని, పుల్లారావును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News