: బీహార్ అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించండి: మోదీ
బీహార్ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీహార్ లోని జహానాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి కోసం ఓటేయాలా? వద్దా? అన్నది ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. అధికారం, స్వార్థం కోసమే ఆర్జేడీ, జేడీయూలు కాంగ్రెస్ తో కలిసి కూటమి ఏర్పాటు చేశాయని ఆయన ఆక్షేపించారు. ప్రజాస్వామ్యం ఉన్నది ప్రజల ఆకాంక్షలు నిలిపేందుకేనని ఆయన చెప్పారు. బీహార్ ఆర్థికంగా బలోపేతం కావాలన్నా, యువతకు ఉపాధి కావాలన్నా ఎన్డీయే కూటమిని ఎన్నుకోవాలని ఆయన స్పష్టం చేశారు.