: కర్నూలు కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ్ మోహన్ పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాలోని బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని దాఖలైన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. మరుగుదొడ్లు ఎందుకు నిర్మించలేదని కలెక్టర్ ను ప్రశ్నించింది. మీ పిల్లలు ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో చదవడం లేదని నిర్లక్ష్యం వహిస్తున్నారా? అంటూ మండిపడింది. నవంబర్ 2వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.