: రాజధాని శంకుస్థాపనను బాధ్యతగా తీసుకోండి... పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు
నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి లోపాలు జరగకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు మరింత జాగ్రత్త వహిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు శంకుస్థాపనను బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని టీడీపీ పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధాని ఏర్పాట్ల గురించి వారితో చర్చించారు. 'మన మట్టి- మన నీరు- మన అమరావతి' స్ఫూర్తితో పార్టీ శ్రేణులంతా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. అంతేగాక ఈ నెల 18న నిర్వహించే 5కె, 10కె రన్ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు.