: ప్రత్యేకహోదా ఇవ్వాలి...లేకపోతే ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలి: కావూరి


ఆంధ్రప్రదేశ్ కు ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదా కంటే ఎక్కువ మేలు చేస్తామంటే కూడా అభ్యంతరం లేదని అన్నారు. ప్రత్యేకహోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించగలిగితే అదే ఇవ్వాలని ఆయన చెప్పారు. లేని పక్షంలో ప్రత్యేకహోదా ఇచ్చితీరాలని ఆయన సూచించారు. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News