: తండ్రికి ఫిర్యాదు చేసిన మలాలా యూసుఫ్ జాయ్
నోబెల్ పురస్కార గ్రహీత మలాలా తలపై కట్టుకునే స్కార్ఫ్ విషయమై తన తండ్రికి ఫిర్యాదు చేసింది. 18 ఏళ్ల మలాలా ఆటలాడే సమయంలో స్కార్ఫ్ ఆమెను తెగ ఇబ్బంది పెడుతోందట. దీంతో తన తండ్రికి ఫోన్ చేసి, "నాన్నా స్కార్ఫ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆటలాడే సమయంలో ఇది అడ్డం వస్తోంది. దీంతో తెగ ఇబ్బంది పడుతున్నాను" అంటూ ఫిర్యాదు చేసిందని మలాలా తండ్రి తెలిపారు. దీంతో "నీకు ఇబ్బంది లేకపోతే ధరించు, ఇబ్బందిగా ఉంటే తీసేయ్" అని తాను సలహా ఇచ్చానని ఆయన చెప్పారు. ముస్లిం సంప్రదాయంలో తలపై ముసుగుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే మలాలా తండ్రికి ఫోన్ చేసింది. కాగా, ఉన్నత విద్యాభ్యాసం అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చేయాలని మలాలా భావిస్తోంది. ఈ మేరకు ఆమె కాలిఫోర్నియా వెళ్లి యూనివర్సిటీ ప్రాంగణం పరిశీలించినట్టు సండే టైమ్స్ కథనం ప్రచురించింది. అక్కడ రాజనీతి శాస్త్రం చదవాలని ఆమె భావిస్తోంది. అలాగే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం కూడా ఆమె ప్రాధామ్యాల్లో ఉందని ఆమె తండ్రి వెల్లడించారు.