: సీనియర్ నటి మనోరమ అంత్యక్రియలు పూర్తి


చెన్నైలోని మైలాపూర్ లో సీనియర్ నటి మనోరమ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం కన్నీటి వీడ్కోలు మధ్య ఆమె అంత్యక్రియలు జరిగాయి. నటీనటులు, వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. అశ్రునయనాలతో ఆమెకు నివాళులర్పించి, తుది వీడ్కోలు పలికారు. కాగా, బహుభాషా నటిగా పేరున్న మనోరమ మూడు తరాల ప్రజలను తనదైన హాస్యంతో ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 1000కి పైగా చిత్రాల్లో ఆమె నటించింది. అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News