: విశాఖ ఆర్కే బీచ్ వద్ద నలుగురు గల్లంతు
విశాఖ తీరంలో ఒక విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్టణంలోని ఆర్ కే బీచ్ లో ఈరోజు నలుగురు గల్లంతయ్యారు. వారిలో విశాఖకు చెందిన ముగ్గురు విద్యార్థులు, ఢిల్లీ నుంచి ఒక పర్యాటకుడు ఉన్నారు. స్థానిక అల్లిపురానికి చెందిన ప్రియాంక విద్యోదయ పాఠశాలలో రోహిత్, గణేశ్, అబ్దుల్ జబ్బార్ లు పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వారు ముగ్గురు ఆర్ కే బీచ్ కు వెళ్లారు. అక్కడ సముద్ర స్నానం చేసేందుకు దిగిన వీరు గల్లంతయ్యారు. ఢిల్లీ నుంచి ఏడుగురు పర్యాటకులు విశాఖ బీచ్ కు వచ్చినట్లు సమాచారం. అందులో షరీఫ్గ అనే ఒకతను గల్లంతయ్యాడు. ఈ సంఘటనతో నేవీ అధికారులు అప్రమత్తమయ్యారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారని తెలుస్తోంది.