: జగన్ దీక్షపై అనుమానాలొస్తున్నాయి: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీక్షపై అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రత్యేక హోదాపై జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షపై ఆయనకు చిత్తశుద్ధి లేదన్న విషయం యథార్థమని ఆరోపించారు. ప్రతి రెండు గంటల కొకసారి జగన్ బస్సులోకి వెళ్లి వస్తున్నట్లు తమకు సమాచారముందన్నారు. అభివృద్ధి పట్ల జగన్ కు కనుక చిత్తశుద్ధి ఉంటే గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసులు ఎందుకు వేయిస్తారని ప్రత్తిపాటి ప్రశ్నించారు. కాగా, నిరాహార దీక్షలో ఉన్న జగన్ షుగర్, బీపీ లెవెల్స్ పడిపోతున్నాయని ఈరోజు పరీక్షలు నిర్వహించిన వైద్యులు చెప్పిన విషయం తెలిసిందే.