: నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఎన్నిక
నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ 89 ఓట్ల అధిక్యంతో ఎన్నికయ్యారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో కేపీ శర్మకు 338 ఓట్లు రాగా, సుశీల్ కొయిరాలాకు 249 ఓట్లు లభించాయి. కాంగ్రెసు పార్టీ తరపున మళ్లీ సుశీల్ కొయిరాలా, సీపీఎన్-యూఎంఎల్ పార్టీ తరపున శర్మ ప్రధాని పదవికి పోటీ పడ్డారు. కాగా, కొత్త రాజ్యాంగంపై రాజకీయ సంక్షోభం ముదరడంతో ప్రధాని సుశీల్ కొయిరాలా తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు నేడు నేపాల్ పార్లమెంట్ కొత్త ప్రధాని ఎన్నిక జరిగింది.