: మా ఎంగేజ్ మెంట్ రింగ్ చాలా ప్రత్యేకంగా ఉంది: అమెరికా అందాల నటి
‘మా ఎంగేజ్ మెంట్ రింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది’ అని అమెరికా అందాల నటి సోఫియా వెర్ గరా సంతోషంగా చెప్పింది. 'మ్యాజిక్ మైక్ స్టార్' జోయ్ మంగనెల్లో, సోఫియాల నిశ్చితార్థం గత డిసెంబర్ లో జరిగింది. మంగనెల్లో కానుకగా ఇచ్చిన డైమండ్ రింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుందని అమ్మడు చెప్పింది. ఆ డైమండ్ రింగ్ తమ ప్రేమకు నిదర్శనమని సోఫియా పేర్కొంది. వచ్చే నెలలో జరగనున్న తమ వివాహాన్ని చాలా గ్రాండ్ గా జరుపుకుంటామని, అందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, ముఖ్యంగా పెళ్లిరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న రెడ్ కార్పెట్ ఆకట్టుకునేలా ఉంటుందని ఈ అమెరికా నటి వివరించింది.