: బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు...స్తంభించనున్న ఆర్థిక కార్యకలాపాలు
వారాంతం ఆదివారాల్లో బ్యాంకులకు సెలవు. తాజాగా ఆదివారానికి తోడు రెండు, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులకు సెలవునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే నెలలో, రెండు పర్యాయాలు బ్యాంకులు రెండు రోజుల పాటు మూతపడతాయి. ఈ సెలవులకు ఒక్కరోజు మరో సెలవు జతచేరినా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా స్తంభించడం ఖాయమే. మరి ఒకేసారి ఐదు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తే, ఆర్థిక కార్యకలాపాలకు భారీ విఘాతమే. అలాంటి పరిస్థితి ఈ నెలలోనే ఎదురు కానుంది. ఈ నెల 20న సాయంత్రం మూతపడనున్న బ్యాంకులు మళ్లీ 26వ తేదీన ఉదయం కాని తెరచుకోవు. అంటే ఏకంగా ఐదు రోజుల పాటు సెలవులన్న మాట. ఇక సెలవుల విషయానికి వస్తే... 21 ఆయుధ పూజ, 22 విజయదశమి (దసరా), 23 మొహర్రం, 24న నాలుగో శనివారం, 25న ఆదివారం. ఆ తర్వాత 26 ఉదయం సోమవారం బ్యాంకుల తలుపులు తెరచుకుంటాయి.