: చంద్రబాబుకు చేరిన ‘కాల్ మనీ’ ఫిర్యాదు...వడ్డీ కట్టలేదని తన భర్తను చితకబాదారన్న మహిళ


నవ్యాంధ్ర రాజకీయ రాజధాని విజయవాడలో ‘కాల్ మనీ’ దందా కలకలం రేపుతోంది. డబ్బు అవసరం ఉన్న వారిని గుర్తించి అప్పులు ఇస్తున్న కాల్ మనీ వ్యాపారులు ఆపై అధిక వడ్డీల కోసం రుణ గ్రహీతలను పీక్కు తింటున్నారు. తీసుకున్న అప్పునకు వడ్డీ చెల్లించలేదన్న కారణంగా ఓ మహిళ కూతురును అపహరించిన ‘సెవెన్ సిస్టర్స్’ నిర్వాహకులు బాలికను వేశ్యావాటికకు అమ్మేసిన వైనం ఇటీవల నగరంలో కలకలం రేపింది. తాజాగా తీసుకున్న అప్పునకు వడ్డీ చెల్లించలేదన్న కారణంగా తన భర్తను నిర్బంధించి చితకబాదారని చిన్నారి అనే మహిళ నేరుగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసింది. కొద్దిసేపటి క్రితం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన సదరు మహిళ తమపై కాల్ మనీ వ్యాపారులు కొనసాగించిన దాష్టీకాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చింది. బాధిత మహిళ నుంచి ఫిర్యాదు తీసుకున్న చంద్రబాబు సదరు విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News