: ‘పింక్’ ర్యాలీని ప్రారంభించిన హరీశ్ రావు...కూతురుతో కలిసి వచ్చిన లక్ష్మి మంచు
రొమ్ము కేన్సర్ పై అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన ‘పింక్ రిబ్బన్ వాక్’ ను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. హైదరాబాదులోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు (కేబీఆర్ పార్కు) వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువతులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ బ్రెస్ట్ కేన్సర్ లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ సెలిబ్రిటీ మంచు లక్ష్మీ ప్రసన్న తన కూతురుతో కలిసి వచ్చింది.