: ఫ్రీడమ్ సిరీస్ లో వన్డే పోరు షురూ... మరికాసేపట్లో కాన్పూర్ లో తొలి వన్డే


భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య కొత్తగా ప్రారంభమైన ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే టీ20 సమరం ముగిసింది. పేలవ ప్రదర్శనతో పర్యాటక జట్టుకు భారత్ అప్పనంగా టైటిల్ అప్పజెప్పేసింది. మరికాసేపట్లో (నేటి ఉదయం 9 గంటలకు) కాన్పూర్ వేదికగా వన్డే సమరం షురూ కానుంది. ఇప్పటికే టీ20 టైటిల్ చేజిక్కిన నేపథ్యంలో సమరోత్సాహంతో సఫారీలు బరిలోకి దిగుతుండగా, వన్డే ర్యాంకింగ్స్ లో సఫారీల కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న టీమిండియా వన్డే టైటిల్ నైనా చేజిక్కించుకోవాల్సిందేనన్న కసితో ఉంది. ఈ నేపథ్యంలో వన్డే సమరం మరింత ఆసక్తికరంగా సాగే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News