: మధ్యంతర ఉత్తర్వులు కాదు...నోటీసులు మాత్రమే వచ్చాయి: చంద్రబాబు


నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో భూమి చదును పనులను నిలిపివేయాలన్న నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఘాటుగా స్పందించారు. గ్రీన్ ట్రైబ్యునల్ జారీ చేసినవి కేవలం నోటీసులు మాత్రమేనని చెప్పిన ఆయన, మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయన్న వార్తల్లో నిజం లేదన్నారు. గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసుల కారణంగా అమరావతి శంకుస్థాపనకు ఎలాంటి ఆటంకం ఏర్పడదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. గ్రీన్ ట్రైబ్యునల్ జారీ చేసిన నోటీసులకు వాస్తవాలను పొందుపరుస్తూ సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటికీ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని కొందరు యత్నిస్తున్నారనడానికి ఈ నోటీసులే ఉదాహరణగా నిలుస్తున్నాయన్నారు. అసలు గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ఎవరో త్వరలోనే తెలుస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News