: బహు భాషా నటీమణి మనోరమ ఇక లేరు...చెన్నై అపోలో ఆసుపత్రిలో కన్నుమూత


తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన సీనియర్ నటి మనోరమ ఇక లేరు. అనారోగ్యానికి గురైన ఆమె చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి కన్నుమూశారు. అత్యధిక చిత్రాల్లో నటించిన నటీమణిగా మనోరమ ఇప్పటికే గిన్నిస్ బుక్ రికార్డులకెక్కారు. 1995లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ తో పాటు 2002లో పద్మశ్రీ పురస్కారాన్ని ఆమె అందుకున్నారు. 1937, మే 26న తమిళనాడులోని మన్నార్ గుడిలో జన్మించిన మనోమర చిన్న వయసులోనే సినీరంగ ప్రవేశం చేశారు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మనోరమ, భౌతిక కాయాన్ని టీ నగర్ లోని ఆమె స్వగృహానికి తరలించారు. నేటి సాయంత్రం ఆమె పార్థివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News