: పరుచూరి బ్రదర్స్ అని పేరు పెట్టిన మహానుభావుడాయన!: పరుచూరి వెంకటేశ్వరరావు


'అనురాగదేవత' అనే సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మించి, తమ సోదరులిద్దరితో మాటలు రాయించిన ఘనత నందమూరి తారకరామారావుదని పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. హైదరాబాదులో జరిగిన 'షేర్' ఆడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అప్పుడే తమకు ఆ మహానుభావుడు 'పరుచూరి బ్రదర్స్' అని పేరుపెట్టారని, ఆ పేరుతోనే తమ సోదరులిద్దరమూ మాటల రచయితలుగా పేరుతెచ్చుకున్నామని అన్నారు. మాటల రచయితలుగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఓసారి రామారావుగారు ఓ షూటింగ్ లో ఉండగా, తాను వర్షంలో నిలబడ్డానని, అప్పుడు రామారావుగారు 'బ్రదర్, ఇలా నీడలోకి రండి' అంటూ పిలిచారని, 'నీడ' దొరికిందని అప్పుడు ఫీలయ్యామని ఆయన తెలిపారు. "నందమూరి వంశం అంటే మా తమ్ముడి భాషలో చెప్పాలంటే 'గుండె చీల్చితే రామారావు కనిపిస్తారు" అని ఆయన అన్నారు. 'షేర్' సినిమా అభిమానులను అలరిస్తుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News