: రాజధాని నిర్మాణానికి 50 వేల ఎకరాల అటవీ భూములు కూడా వినియోగిస్తాం!: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం రైతులిచ్చిన 33 వేల ఎకరాల్లోనే జరగడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంలో రైతులిచ్చిన భూములకు తోడు, మరో 50 వేల ఎకరాల అటవీ భూములు కలిసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ అటవీ భూములను వినియోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన తరువాత అటవీ భూములను రాజధాని నిర్మాణంలో భాగం చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ మొత్తం భూమిని పారదర్శకమైన విధానంలో రాజధాని నిర్మాణానికి వినియోగిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News