: 18న కేసీఆర్ ను ఆహ్వానిస్తా...రాజమండ్రి ఇకపై 'రాజమహేంద్రవరం': కేబినెట్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన 8 గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కేంద్రంగా చర్చ నడిచింది. శంకుస్థాపనకు ఇన్విటేషన్ ను ఖరారు చేశారు. అలాగే తెలంగాణ మంత్రులు, నేతలను రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించాలని నిర్ణయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ నెల 18న తానే స్వయంగా ఆహ్వానిస్తానని చంద్రబాబునాయుడు చెప్పడం విశేషం. రాష్ట్రంలోని ప్రతిపక్ష నేత జగన్ నుంచి ప్రతి సర్పంచ్, వార్డ్ మెంబర్ ను ఆహ్వానించాలని, రాజధాని ప్రాంత రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. అలాగే రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు.